
సిడ్నీ (ఎస్‌సీజీ)
ఆస్ట్రేలియాలో గత 150 ఏళ్లుగా క్రీడలకు ప్రముఖ కేంద్రంగా విరాజిల్లుతోంది సిడ్నీ. నగరానికి ఈస్ట్‌లో మూరే పార్క్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)ని నెలకొల్పారు. ఈ స్టేడియంలో ఎక్కడి నుంచి మ్యాచ్‌ను చూసినా చాలా దగ్గర్నించి తిలకించిన అనుభూతి కలగడం దీని ప్రత్యేకత. మొదట్లో గ్యారిసన్ గ్రౌండ్‌గా పిలిచిన ఈ మైదానంలో 1848 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. బ్యాటింగ్‌కు ఈ వికెట్ స్వర్గధామం. ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లకు ఇది వేదికగా నిలిచింది.
బ్రాడ్‌మన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తగత స్కోరు (452 నాటౌట్) చేసింది ఇక్కడే. 1970లో వికెట్‌లో గణనీయ మార్పులు తీసుకురావడంతో స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. న్యూసౌత్‌వేల్స్ బ్లూస్‌కు ఇది సొంత మైదానం. ప్రస్తుతం దీని కెపాసిటీ 44,002. ఆసీస్ టూరిజానికి సిడ్నీ పెట్టింది పేరు. అంతర్జాతీయ వాణిజ్యం, విద్య, విశ్రాంతికి ఇది ప్రసిద్ధి. 140 భాషల ప్రజలు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద హార్బర్ ఇక్కడే ఉంది.
మార్చి 8న ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌తో పాటు 18న క్వార్టర్‌ఫైనల్-1, 26న సెమీస్-2కు ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.