ఫైనల్లో పంజాబ్‌పై విజయం
భువనేశ్వర్ : జాతీయ టి20 క్రికెట్ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ని గుజరాత్ కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడ ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో గుజరాత్ 2 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఇందర్ సింగ్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), హిమాన్షు చావ్లా (17 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్ రోహిత్ దహియా 15 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ (49 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు.
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత గుజరాత్
Published Wed, Apr 8 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement
Advertisement