జాతీయ ర్యాంకింగ్ ఈస్ట్‌జోన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ విజేతగా నిలిచింది.
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ ఈస్ట్‌జోన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ విజేతగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో మంగళవారం జరిగిన సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో నైనా 4-3 (11-8, 10-12, 11-8, 9-11, 6-11, 11-9, 12-10)తో మౌమితా దత్తా (పశ్చిమ బెంగాల్)పై గెలిచింది.
క్వార్టర్ ఫైనల్లో నైనా 3-2తో అర్చన కామత్ (కర్ణాటక)పై, సెమీఫైనల్లో 4-1తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్ జూనియర్ స్థాయిలో రెండు జాతీయ ర్యాంకింగ్ టైటిల్స్ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నైనా గుర్తింపు పొందింది.