
ద్యుతీ చంద్‌కి స్వర్ణం
తావోయువాన్ సిటీ: తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్ప్రింటర్ ద్యుతీ చంద్ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన 100మీ. పరుగును తను 11.50 సెకన్ల టైమింగ్‌తో ముగించింది. అయితే ఇది ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలకు (11.32 సె.) సరిపోలేదు. ద్యుతీచంద్‌కు తెలంగాణకు చెందిన రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.