ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 334 పరుగుల తేడాతో
చెస్టర్‌ఫీల్డ్: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 334 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట చివరి రోజు 498 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కమలేశ్ నాగర్‌కోటి ఐదు వికెట్లు పడగొట్టగా... అశోక్, శివమ్ రెండేసి వికెట్లు తీశారు.
యూత్ టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే భారీ విజయం కావడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 173 పరుగులవద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 498 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.