England Under-19
-
భారత యువ జట్టు ఘనవిజయం
చెస్టర్‌ఫీల్డ్: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 334 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట చివరి రోజు 498 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కమలేశ్ నాగర్కోటి ఐదు వికెట్లు పడగొట్టగా... అశోక్, శివమ్ రెండేసి వికెట్లు తీశారు. యూత్ టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే భారీ విజయం కావడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 173 పరుగులవద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 498 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. -
భారత్, ఇంగ్లండ్ యూత్ టెస్టు డ్రా
నాగ్‌పూర్: భారత్ అండర్–19 జట్టు వికెట్ కీపర్ సురేశ్ లోకేశ్వర్ (125 బంతుల్లో 92 నాటౌట్; 14 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన యూత్ టెస్టు తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 238 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులతో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలవైునా.... లోయర్ ఆర్డర్ సహకారంతో లోకేశ్వర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లోకేశ్వర్‌తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డారిల్ ఫెరారియో (37) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో హెన్రీ బ్రూక్స్ 3, ఆరోన్ బియర్డ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు 23/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... ఆఫ్ స్పిన్నర్ సిజోమో్న్ జోసెఫ్ (6/62) దాటికి 53 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. జార్జ్ బార్ట్లెట్ (97 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ చేయగా... హ్యారీ బ్రూక్ (58 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. భారత బౌలర్లలో డారిల్ ఫెరారియో 2 వికెట్లు పడగొట్టగా... కనిష్క్ సేత్, రిషభ్ భగత్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 501/5 డిక్లేర్ చేయగా... భారత్ 431/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
కదంతొక్కిన శుభ్‌మాన్, పృథ్వీ షా
ముంబై: తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఆ తర్వాత బౌలర్లు విజృంభించారు. వెరసి ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత అండర్–19 జట్టు 230 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. తాజా విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరును చేసింది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (120 బంతుల్లో 160; 23 ఫోర్లు, ఒక సిక్స్), పృథ్వీ షా (89 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. 383 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కమలేశ్ నాగర్కోటి (4/31), వివేకానంద్ తివారి (3/20), శివమ్ (2/18) దెబ్బతీశారు. దాంతో ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. -
కుర్రాళ్లు లెక్క సరిచేశారు
ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత్ ఘన విజయం ముంబై: బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా రాణించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 129 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి వన్డేలో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రెండో మ్యాచ్‌లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్షు రాణా (66 బంతుల్లో 58; 10 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (62 బంతుల్లో 75; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కమలేశ్ నాగర్కోటి (32 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (24), అభిషేక్ శర్మ (24) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ నాలుగు, హెన్రీ బ్రూక్స్ మూడు వికెట్లు తీశారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. రాలిన్స్ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత్ తరఫున స్పిన్నర్ అనుకూల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టగా... శివమ్, ఇషాన్ పోరెల్లకు రెండేసి వికెట్లు లభించాయి. సిరీస్‌లోని మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.