జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నల్గొండ జట్టు విజయం సాధించింది. జి.పుల్లారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన లీగ్ పోటీల్లో నల్గొండ 59-28తో హైదరాబాద్‌పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నల్గొండ 26-10తో ఆధిక్యం సాధించింది. అనంతరం తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ జట్టుకు మహబూబ్‌నగర్‌పై విజయం దక్కింది.
44-13తో ఆ జట్టును మట్టికరిపించింది. మొదటి అర్ధభాగంలో 30-7తో హైదరాబాద్ పైచేయి సాధించగా ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించింది. అలాగే ఆదిలాబాద్ జట్టుపై నల్గొండ 40-36తో గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 23-13తో నల్గొండ జట్టు ముందంజ వేసింది. రెండో అర్ధభాగ ంలో ఆదిలాబాద్ జట్టు ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆఖరి నిమిషంలో నల్గొండ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో గట్టెక్కింది.
నల్గొండ జట్టు విజయం
Published Sun, Sep 22 2013 12:07 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement