హ్యూస్కు కన్నీటి వీడ్కోలు
మెల్‌బోర్న్: అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు ముగిశాయి. మాక్స్‌విలేలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. దేశవాళీ మ్యాచ్ సందర్భంగా తలకు బౌన్సర్ తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే.
హ్యూస్ అంత్యక్రియలకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హాజరయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్తో పాటు ఇతర క్రికెటర్లు, అధికారులు, భారత్ జట్టు తరపున రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వేలాది మంది అభిమానులు, స్నేహితులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో హ్యూస్ మృతికి సంతాపం తెలియజేశారు. (ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి)