న్యూఢిల్లీ: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సమయం వచ్చేసిందని అంటున్నారు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. మరింత మంది ప్రతిభగల మహిళా క్రికెటర్లను వెలికి తీయాలంటే వారికి కూడా పూర్తిస్థాయిలో ఐపీఎల్ నిర్వహించడం ఒకటే మార్గమని గావస్కర్ స్పష్టం చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా సరిపెట్టుకున్న తర్వాత గావాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. (షఫాలీని అలా చూడటం కష్టమైంది)
‘వచ్చే ఏడాదినుంచి పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్ నిర్వహించాలి. ఆ టోర్నీవల్ల దేశంలో ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లు మరింతమంది వెలుగులోకి వస్తారు. టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శన దేశంలో ఎంతో ప్రతిభ ఉందని నిరూపించింది. ఎనిమిది జట్లతో నిర్వహించేందుకు కావాల్సిన ప్రతిభావంతులు లేకపోయినా.. మహిళల ఐపీఎల్ జరగాల్సిందే’ అని గావాస్కర్ తెలిపారు. ఇక దేశంలో మహిళల క్రికెట్‌ను బీసీసీఐ నడిపిస్తున్న తీరుపై గవాస్కర్ సంతృప్తి ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాదిరి మహిళల కోసం ఉమెన్స్ టీ20 చాలెంజర్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్ )
Comments
Please login to add a commentAdd a comment