అమెరికాకు పూర్తి స్థాయి జట్టు | United States of America to a full-fledged team | Sakshi

అమెరికాకు పూర్తి స్థాయి జట్టు

Aug 13 2016 2:23 AM | Updated on Sep 4 2017 9:00 AM

వెస్టిండీస్‌తో జరిగే రెండు టి20ల కోసం అమెరికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ప్రకటించారు.

విండీస్‌తో టి20 సిరీస్


న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగే రెండు టి20ల కోసం అమెరికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ప్రకటించారు. ఈనెల 27, 28న జరిగే ఈ మ్యాచ్‌లకు ధోని నేతృత్వంలో 14 మందితో కూడిన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేశారు. గత మేలో జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకున్న 11 మంది రెగ్యులర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులో చోటు దక్కించుకోగా సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రైనా, హర్భజన్‌లకు మొండిచేయి ఎదురైంది. ఈ ముగ్గురు దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు.
 

టి20 జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, రోహిత్, ధావన్, రహానే, రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, బిన్నీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement