పంజాబ్‌పై యూపీ విజయం | UP win on Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై యూపీ విజయం

Published Thu, Feb 11 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

UP win on Punjab

పంజాబ్‌పైయూపీ విజయం
లక్నో: హాకీ ఇండియా లీగ్‌లో సొంతగడ్డపై ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచింది. పంజాబ్ వారియర్స్‌తో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ 4-1 గోల్స్ తేడాతో నెగ్గింది. 10వ నిమిషంలో మార్క్ గ్లెన్‌హార్న్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో పంజాబ్‌కు ఆధిక్యం లభించింది. 19వ నిమిషంలో యూపీ తరఫున పిలెట్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. 41వ నిమిషంలో పిలెట్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి యూపీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 43వ నిమిషంలో ఆగస్టిన్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేయడంతో యూపీ 4-1తో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత యూపీ ఖాతాలో 23 పాయింట్లు ఉన్నాయి. దీంతో సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement