బొటాస్‌కు తొలి ‘పోల్‌ పొజిషన్‌’ | Valtteri Bottas stuns Lewis Hamilton to take his first F1 pole at Bahrain Grand Prix | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు తొలి ‘పోల్‌ పొజిషన్‌’

Published Sun, Apr 16 2017 2:15 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

బొటాస్‌కు తొలి ‘పోల్‌ పొజిషన్‌’ - Sakshi

బొటాస్‌కు తొలి ‘పోల్‌ పొజిషన్‌’

నేడు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి
మనామా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో బొటాస్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 28.769 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి పోల్‌ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌ జట్టుకే చెందిన లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానం నుంచి రేసును మొదలుపడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ వరుసగా 14వ, 18వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. బొటాస్‌ (మెర్సిడెస్‌), 2. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 3. వెటెల్‌ (ఫెరారీ), 4. రికియార్డో (రెడ్‌బుల్‌), 5. రైకోనెన్‌ (ఫెరారీ), 6. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 7. హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), 8. మసా (విలియమ్స్‌), 9. గ్రోస్యెన్‌ (హాస్‌), 10. పాల్మెర్‌ (రెనౌ), 11. క్వియాట్‌ (ఎస్టీఆర్‌), 12. లాన్స్‌ స్ట్రోల్‌ (విలియమ్స్‌), 13. వెర్లీన్‌ (సాబెర్‌), 14. ఒకాన్‌ (ఫోర్స్‌ ఇండియా), 15. అలోన్సో (మెక్‌లారెన్‌), 16. సెయింజ్‌ (ఎస్టీఆర్‌), 17. వాన్‌డూర్నీ (మెక్‌లారెన్‌), 18. పెరెజ్‌ (ఫోర్స్‌ ఇండియా), 19. ఎరిక్సన్‌ (సాబెర్‌), 20. మాగ్నుసెన్‌ (హాస్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement