విరాట్ ప్లాప్ షోకు అనుష్క కారణమా?
ఆక్లాండ్ : టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా పేలవమైన ప్రదర్శనతో మీడియాకెక్కాడు. అయితే అందుకు కారణం బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కారణం అని పుకార్లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫరవా లేదన్నట్టుగా ఆడిన విరాట్ కోహ్లి సడన్‌గా ఫ్లాపయ్యాడు. ఆక్లాండ్‌లో ఆటపై ఏకాగ్రత చూపలేకపోయాడు.
కేవలం నాలుగంటే నాలుగే పరుగులకు తన వికెట్ పారేసుకున్నాడు. ఇంతకీ కారణమేంటో అని ఆరా తీస్తే... బాలీవుడ్ భామ అనుష్క శర్మతో మనోడు ఆక్లాండ్‌లో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడుట. గతంలో అనుష్కతో కలిసి అనేక యాడ్స్‌లో నటించిన కోహ్లి ... ఈ బాలీవుడ్ బ్యూటీ కారణంగా ఆటపై ఏకాగ్రత చూపడంలేదని టీమిండియా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.