శ్రీలంక టప టపా.. | virat kohli and gang ook stay on another big victory | Sakshi
Sakshi News home page

శ్రీలంక టప టపా..

Published Mon, Aug 14 2017 10:53 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

శ్రీలంక టప టపా.. - Sakshi

శ్రీలంక టప టపా..

పల్లెకెలె:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్స్వీప్ చేసే దిశగా  కొనసాగుతోంది. చివరిదైన మూడో టెస్టులో శ్రీలంక వికెట్లను టపటపా కూల్చుతున్న విరాట్ సేన మరో భారీ విజయాన్ని సాధించే దిశగా సాగుతోంది. 19/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న లంకేయులకు తొలి సెషన్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే(16), పుష్సకుమార(1), కుశాల్ మెండిస్(12),కుశాల్ మెండిస్(12) లను స్వల్ప విరామాల్లో పెవిలియన్ కు పంపిన భారత్ భారీ గెలుపుకు బాటలు  వేసుకుంది. దాంతో ఫాలో ఆన్ ఆడుతున్న లంక జట్టు 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

లంకేయలు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 300 పరుగులకు పైగా పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం లంక కోల్పోయిన నాలుగు వికెట్లలో మొహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్ లు తలో వికెట్ తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ 487 ఆలౌట్

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 135 ఆలౌట్



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement