అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే! | Virat Kohli, Anushaka Sharma patch up, That is for no one else to know | Sakshi
Sakshi News home page

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

Published Mon, Apr 25 2016 7:23 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

అనుష్క గురించి కోహ్లి ఏం చెప్పాడంటే!

విరాట్‌ కోహ్లి కెరీర్‌ మంచి జోరుమీద ఉంది. అటు మైదానంలోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ అతను దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌గా దూకుడు మీదున్న కోహ్లి తాజాగా టీ-20లో సెంచరీ కూడా కొట్టాడు. క్రికెట్‌లో అసాధారణమైన పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్న కోహ్లి వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. గతంలో బ్రేకప్‌ చేసుకున్నట్టు భావిస్తున్న కోహ్లి-అనుష్క శర్మ మళ్లీ ఒక్కటైనట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ప్రేమజంట డిన్నర్ చేస్తూ కనబడింది.

ఈ నేపథ్యంలో కోహ్లి సోమవారం ముంబైలో తన అభిమానులతో పిచ్చాపాటిగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియురాలు అనుష్క శర్మతో మళ్లీ కలిసిపోయారా? ఒకరు ప్రశ్నించగా.. 'అదిమాత్రం ఎవరికీ తెలియకూడదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను' అంటూ దాటవేశారు. దీంతో ఓ మహిళా జర్నలిస్టు 'మీ వ్యక్తిగత జీవితం ఎలా సాగుతుంది' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కనుబొమ్మలు ముడేసిన కోహ్లి 'నా వ్యక్తిగత జీవితం గురించి కొంతవరకు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌కు అవకాశముందని చెప్పాను. దానర్థం నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి విషయాన్ని చెప్తానని కాదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement