న్యూయార్క్: ఇటీవల కాలంలో అటు ఆటలోనూ ఇటు సంపాదనలోనూ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో శతకం సాధించడం ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన కోహ్లి.. ఆర్జనలో కూడా తనదైన ముద్రను చూపెడుతున్నాడు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత విలువైన టాప్ -10 అథ్లెట్లలో కోహ్లి ఏడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలోనే అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోన్ మెస్సీని కోహ్లి అధిగమించాడు.
ఈ జాబితా ప్రకారం కోహ్లి గతేడాది 14.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 93 కోట్లు)ను ఆర్జించగా, మెస్సీ 13.5 మిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అత్యధిక విలువైన ఫోర్బ్స్ టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో కోహ్లి ఒక్కడే క్రికెటర్ కావడం మరో విశేషం. భారత్‌లో అత్యధికంగా ఆర్జించే ప్రముఖుల్లో కోహ్లి కూడా ఒకరని.. కిందటేడాది ఆయన అత్యధికంగా 14.5 మిలియన్ డాలర్లను ఆర్జింనట్లు ఫోర్బ్స్ పేర్కొంది.ఇందులో స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ 37.2 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జమైకా స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్ 27 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment