
చెమ్స్‌ఫోర్డ్: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లి.. ఆ దేశ పాపులర్ క్రికెట్ ఫ్యాన్ క్లబ్ బార్మీ ఆర్మీ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. గతేడాది కోహ్లిపై ఒక వీడియోను రూపొందించిన సదరు ఫ్యాన్ క్లబ్.. తాజాగా 2017-18 సీజన్‌కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కోహ్లికి అందజేసింది.
ఎసెక్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు ఆట అనంతరం కోహ్లి ఈ అవార్డను అందుకున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్వీటర్ అకౌంట్‌లో అవార్డుతో కోహ్లి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.
చదవండి: ఆటాడుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment