ధోనీ, యువీ.. మధ్యలో కోహ్లీ | Virat Kohli sandwiched between MS Dhoni and Yuvraj Singh in the flight | Sakshi
Sakshi News home page

ధోనీ, యువీ.. మధ్యలో కోహ్లీ

Published Mon, Feb 22 2016 4:05 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ధోనీ, యువీ.. మధ్యలో కోహ్లీ

ధోనీ, యువీ.. మధ్యలో కోహ్లీ

ఢాకా: ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో బ్రేకప్.. ఈ మధ్య శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్కు విశ్రాంతి తీసుకున్నభారత  యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ.. మళ్లీ జట్టుతో చేరాడు. బంగ్లాదేశ్లో జరిగే ఆసియా కప్లో ఆడేందుకు భారత జట్టుతో కలసి కోహ్లీ ఢాకా వెళ్లాడు. ఈ ఈవెంట్లో బుధవారం జరిగే ఆరంభ మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

ఢాకాకు విమానంలో వెళ్తున్నప్పటి ఫొటోను విరాట్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మధ్యలో కూర్చుని కోహ్లీ ఫోజిచ్చాడు. లెజెండర్లతో కలసి ఢాకా వెళ్తున్నానంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆసియా కప్తో పాటు వచ్చే నెలలో జరిగే టి-20 ప్రపంచ కప్లో ఈ ముగ్గురు  క్రికెటర్లు కీలకం. పొట్టి క్రికెట్లో ఇటీవల టీమిండియా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు టి-20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ధోనీసేన.. ఆ వెంటనే శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement