షానియేరా థాంప్సన్‌ను పెళ్లాడిన వసీం అక్రం | Wasim Akram marries Australian girlfriend Shaniera Thompson | Sakshi
Sakshi News home page

షానియేరా థాంప్సన్‌ను పెళ్లాడిన వసీం అక్రం

Aug 21 2013 8:13 PM | Updated on Sep 1 2017 9:59 PM

మరో పెళ్లి ఆలోచ‌న లేద‌ని చెప్పిన పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ వసీం అక్రమ్‌ మనసు మార్చుకున్నాడు.

లాహూర్ : మరో పెళ్లి ఆలోచ‌న లేద‌ని చెప్పిన పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ వసీం అక్రమ్‌ మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన షానియేరా  థాంప్సన్‌ అనే యువతిని సెకండ్ మ్యారేజీ  చేసుకున్నట్లు  బుధవారం ప్రకటించాడు. ద్వితీయ వివాహం చేసుకోనని గతంలో చెప్పిన మాటను వసీం చెప్పినా అతని రెండో వివాహాన్ని కుటుంబ పెద్దల అంగీకారంతో చేసుకున్నాడు. అక్రమ్ ఆగస్టు 12వ తేదీన పెళ్లి చేసుకున్నా ఇప్పటి వరకూ ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచారు. కేవలం ఈ వివాహానికి వారి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని ప్రాధమిక సమాచారం.  గతంలోనే మీడియాలో వసీం అక్రం వివాహానికి సంబంధించి వార్తలు వచ్చని సంగతి తెలిసిందే.

క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వసీం అక్రమ్‌ సంపాదించుకున్నాడు. 17 ఏళ్ల తన క్రీడాజీవితంలో మేటి పేస్‌ బౌలర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కోచ్‌గా, కామెంటేటర్‌గా, మోడల్‌గానూ బహుముఖ పాత్రల్లో రాణిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యేకమైన వ్యక్తినని చాలాసార్లే ప్రూవ్‌ చేసుకున్నాడు వసీం అక్రమ్. క్యాన్సర్ వ్యాధితో అతడి భార్య హ్యూమా అక్టోబ‌ర్ 2009లో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మ‌ర‌ణించింది. అప్పటి నుంచి అక్రమ్ ఒంట‌రి గానే కాలం గడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement