వసీం అక్రమ్-వివ్ రిచర్డ్స్(ఫైల్‌ఫొటో)
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ పేస్‌కు వన్నె తెచ్చిన బౌలర్లలో అక్రమ్ కూడా ఒకడు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఆ స్థాయి బౌలింగ్‌ను అందుకున్న బౌలర్ అక్రమ్. ప్రధానంగా బంతిని రివర్స్ స్వింగ్ చేయడంలో అక్రమ్ సిద్ధహస్తుడు. తన మాయాజాలంతో పాకిస్తాన్‌కు ఎన్నో విజయాలను అందించిన ఘనత ఈ ఎడమచేతి వాటం బౌలర్‌ది. ఆ క్రమంలోనే ప్రత్యర్థి జట్లు అక్రమ్ బౌలింగ్‌కు భయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఓ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత అక్రమ్ భయపడ్డాడట. ఈ విషయాన్ని అక్రమ్ షేర్ చేసుకున్నాడు. (బాస్.. నాకు ఓపెనింగ్ కొత్త కాదు)
‘ 1988 ప్రాంతంలో రిచర్డ్స్ నా బౌలింగ్‌లో చాలాసార్లు హిట్ చేశాడు. అతనొక భారీ కాయుడు. నేనేమో సన్నగా ఉండేవాడిని. అయితే రిచర్డ్స్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఓ బౌన్సర్ వేస్తే అతని క్యాప్ కింది పడిపోయింది. అదొక పెద్ద ఘనతగా నేను భావించా. దాంతో రిచర్డ్స్ వద్దకు వెళ్లి నాకు వచ్చీ రాని ఇంగ్లిష్‌లో స్లెడ్జ్ చేశా. దానికి రిచర్డ్స్ రిప్లై చేసి షాక్ తిన్నా.మళ్లీ ఇలా చేశావంటే ఊరుకోను అన్నాడు. ఆ తర్వాత ఏదో అన్నాడు. అది నాకు సరిగా అర్థం కాలేదు. ఇదే విషయాన్ని అప్పటి మా కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పా. ఏమీ భయపడవద్దు. మళ్లీ బౌన్సర్ వేయమన్నాడు. దాంతో బౌన్సర్ వేశా.
చివరగా ఓ ఇన్‌స్వింగర్‌తో రిచర్డ్స్‌ను బౌల్డ్ చేయడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇక వెళ్లిపో’ అంటూ పెద్దగా అరిచాను. ఆ తర్వాత రిచర్డ్స్ పెవిలియన్‌కు చేరిన తర్వాత షర్ట్ లేకుండా కూర్చోవడం చూశాను. అయితే నాకు కోసమే చూస్తున్నాడని అనుకోలేదు. మేము డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో రిచర్డ్స్ బ్యాట్ పట్టుకుని షర్ట్ లేకుండా నా కోసం చూస్తున్నాడు. ఇది నాకు అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఇమ్రాన్‌కు చెప్పా. నువ్వే హ్యాండిల్ చేసుకుంటేనే బాగుంటుదని చెప్పాడు. అదే సమయంలో ఇమ్రాన్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయా. ఆ తర్వాత రిచర్డ్స్ వద్దకు వెళ్లి సారీ చెప్పా. మళ్లీ ఆ తప్పు చేయనన్నా. నువ్వు అలా చేయకపోవడం మంచిది. ఒకవేళ మళ్లీ రిపీట్ అయితే నిన్ను చంపేస్తా’ అని రిచర్డ్స్ వార్నింగ్ ఇచ్చాడన్నాడు. (‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్’)
Comments
Please login to add a commentAdd a comment