సాక్షి స్పోర్ట్స్, హైదరాబాద్: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు(శుక్రవారం) జరగబోయే టీ20 మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 4 గంటల నుంచి గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. వర్షం పడకుంటే మ్యాచ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఒక వేళ వర్షం పడితే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే సన్నద్దము అయ్యామని తెలియజేశారు. వర్షం పడితే తడవకుండా రోప్ వద్దకు వెళ్లాలని సూచించారు. లాప్ టాప్, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాక్యూలర్, బ్యాటరీ, బ్యాగ్స్, బ్యానర్స్, సిగరెట్లు, లైటర్లు, కాయిన్స్, హెల్మెట్, వాటర్ బాటిల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, రైటింగ్ పెన్స్, ఫెర్ఫ్యూమ్స్, తినుబండారాలు, పవర్ బ్యాంక్ వంటివి తీసుకురావద్దని సూచించారు. దాదాపు 9 వేలకు పైగా వాహనాలు స్టేడియంకు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్ పార్కింగ్ కోసం రామంతపూర్ వైపు వుండే ఎల్‌జీ గోడౌన్ వద్ద పార్క్ చేసి గేట్ 1, 2 ద్వారా వెళ్లాలని తెలిపారు.
ప్రేక్షకులు తొందర పడి గాబరా పడకుండా ఉండాలని హెచ్‌సీఏ సెక్రటరీ శేష నారాయణ తెలిపారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్మ్‌డ్ కంపోనెంట్, సెక్యురిటి వింగ్ కూడిన దాదాపు 1800 మంది పోలీసులు డ్యూటీలో ఉంటారని చెప్పారు. స్టేడియంతో సహా చుట్టుపక్కల దాదాపు 56 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment