మరీ ఇంత చెత్త ప్రదర్శనా? | we get out so cheaply | Sakshi
Sakshi News home page

మరీ ఇంత చెత్త ప్రదర్శనా?

Published Mon, Aug 7 2017 1:11 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

మరీ ఇంత చెత్త ప్రదర్శనా? - Sakshi

మరీ ఇంత చెత్త ప్రదర్శనా?

కొలంబో: భారత్ తో జరిగిన వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాజయం చెందడంపై శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధానంగా రెండో టెస్టులో ఇన్నింగ్ప్ పరాజయాన్ని మూటగట్టుకోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తరువాత మాట్లాడిన చండిమాల్.. తమ ఇన్నింగ్సే ఎక్కువ నిరూత్సాహపరిచిందన్నాడు. పర్యాటక జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆరొందలకు పైగా స్కోరు చేస్తే, ఆతిథ్య జట్టైన తాము మరీ ఘోరంగా రెండొందల లోపే ఆలౌట్ కావడం బాధించిందన్నాడు.

 

అసలు ఇంతటి చెత్త ప్రదర్శను తాను ఊహించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నిజంగా భారత జట్టు ప్రదర్శన అమోఘంగా ఉందన్నాడు. వారు తొలుత భారీ పరుగులు చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారన్నాడు.కాకపోతే తాము స్థాయికి తగ్గ ఆటను ఆడలేదని వాస్తవాన్ని చండిమాల్ అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్ లో  ఐదు వికెట్లు తీసి ఇన్నింగ్స్ విజయంలో్ సహకరించిన భారత స్పిన్నర్ పై చండిమాల్ ప్రశంసలు కురిపించాడు. అతను నిజంగా ప్రత్యేకమైన బౌలర్ అని అభివర్ణించాడు. జడేజా ఒక వైవిధ్యమైన బౌలర్ కాబట్టే నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడని కొనియాడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement