ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం న్యూజిలాండ్కు ప్లస్ అవుతుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. మొదట ఎవరు బ్యాటింగ్ తీసుకుంటే వారిపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ప్రత్యర్థిని తాము నిర్దేశించే లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా చేయోచ్చని అంటున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్కు ప్లస్ అవుతుందా అంటూ సాక్షి ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా.. ఈ విధంగా స్పందించారు. ఈ రోజు న్యూజిలాండ్ టీం ఆస్ట్రేలియాను బెంబేలిత్తిస్తుందని, వారిపై విజయం సాధిస్తుందని అన్నారు. ఆసిస్ను న్యూజిలాండ్ చిత్తుచేయాలని తామంతా కోరుకుంటున్నామని అన్నారు.