
వెల్లింగ్టన్ (వెస్ట్‌పాక్ స్టేడియం)
స్టేడియాలు చూసొద్దాం
బహుళ ప్రయోజన క్రీడలకు అనుకూలంగా 1999లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆఫ్ ఫీల్డ్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. న్యూజిలాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ క్రికెట్ ఇందులోనే నడుస్తుంటాయి. నగరంలో ఎక్కడి నుంచైనా నడుచుకుంటూ ఈ స్టేడియానికి వెళ్లిపోవచ్చు.
ఈ మైదానం ఎత్తయిన ప్రదేశంలో ఉండటం వల్ల సహజమైన గాలులు ఎక్కువగా వీస్తాయి. సామర్థ్యం 34 వేలు. ఇందులో 70 శాతం సీట్లకు పైకప్పు ఉండదు. ఇక్కడ గ్రీన్‌బెల్ట్ రహదారులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ఓడ రేవులు, వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ మైదానంలో మార్చి 21న క్వార్టర్‌ఫైనల్-4 జరుగుతుంది.