
అందువల్లే భారత్‌తో ఓడాం: పాక్ కెప్టెన్
చాంపియన్ ట్రోఫీలో భారత్‌తో ఓటమిపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ స్పందించాడు.
లండన్: చాంపియన్ ట్రోఫీలో భారత్‌తో ఓటమిపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ స్పందించాడు. ఓడిపోవడానికి కారణాన్ని తెలియచేశాడు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు మొదటిసారి భారత్‌తో ఆడుతున్నారని తెలిపాడు.యువ ఆటగాళ్లలో చాలా మంది భారత్‌తో మ్యాచ్ అనగానే ఒకింత ఒత్తిడికి గురయ్యారని చెప్పాడు.
"భారత్-పాక్ మ్యాచ్ ఎప్పడైనా పెద్ద యుద్ధం లాంటిదే. మా జట్టులో చాలా మంది యువఆటగాళ్లు భారత్‌తో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నారు. దీంతో యువఆటగాళ్లు ఒకింత ఒత్తిడి, ఆందోళనలో ఉన్నారు. దీంతో వారు ఒత్తిడిలో అందివచ్చిన అవకాశాలను చేజార్చారు. వారిని అందులోనుంచి బయటకు తీసుకురావడానికి మేం చాలా ప్రయత్నించాం. వారితో ఉదయమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గ్రౌండ్‌లో అమలు చేయాల్సిన ప్రణాళికలపై అందరం చర్చించాం. కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేక పోయాం. మిస్‌ఫీల్డిండ్‌తో పాటు, కీలక సమయంలో క్యాచ్‌లను వదిలేశారు. ఆ సమయంలో మేము ఫీల్డిండ్ సరిగ్గా చేసిఉంటే పరిస్థతి ఇంకోలా ఉండేది. ఆడబోయే రెండు మ్యాచ్‌లు మాకు చాలా కీలకం. మా దృష్టి అంతా ఇప్పుడు వాటిపైనే ఉంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ఒకింత నిరాశలో ఉన్నా ప్రస్తుతం అంతా సర్దుకుంది" అని సర్ఫరాజ్ అన్నాడు.