లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి 26 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఆసీస్ బౌలర్లు వణుకుపుట్టించారు. దీంతో పరుగుల విషయం పక్కకు పెడితే క్రీజులో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు విన్సే(0), రూట్(8), మోర్గాన్(4)లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ 6 ఓవర్లు ముగిసే సరికే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. స్టార్క్ రెండు వికెట్లు, బెహ్రాన్‌డార్ఫ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బెయిర్ స్టో, స్టోక్స్ క్రీజులో ఉన్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మరోసారి బాధ్యాతయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. సారథి ఆరోన్ ఫించ్ (100;116 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. డేవిడ్ వార్నర్(53; 61 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. టాపార్డర్ జోరును చూసి ఆసీస్ 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే మిడిల్, లోయర్ ఆర్డర్ మరోసారి విఫలమవడంతో 300కిపైగా పరుగులు సాధించలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లతో రాణించగా.. ఆర్చర్, వుడ్, స్టోక్స్, మొయిన్‌లు తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment