ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ | World Wrestling Tourney: Babita to depression | Sakshi
Sakshi News home page

ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ

Published Fri, Sep 11 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ

ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ

లాస్ వెగాస్ (అమెరికా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. బబితా కుమారి, వినేశ్ ఫోగత్, నవ్‌జ్యోత్ కౌర్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. 2012లో కాంస్యం సాధించిన బబిత (53 కేజీలు) క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయింది. బబిత 2-6తో చైనాకు చెందిన గ్జూచున్ జోంగ్ చేతిలో ఓడింది. యువ రెజ్లర్ వినేశ్ (48 కేజీలు) తొలి రౌండ్‌లోనే  4-8తో కిమ్ హ్యోన్ గ్యాంగ్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం పాలైంది.

నవ్‌జ్యోత్ (69 కేజీలు) కూడా తొలి రౌండ్‌లోనే 0-8తో అలినా స్టాడ్నిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల 85 కేజీల గ్రీకో రోమన్ విభాగం క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్ 0-10తో రమీ ఆంటెరో (ఫిన్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement