యువరాజ్ సింగ్ మెరుపులు | yuvraj singh 70 not out lifts to 185 runs | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్ మెరుపులు

Published Tue, May 2 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

యువరాజ్ సింగ్ మెరుపులు

యువరాజ్ సింగ్ మెరుపులు

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా మంగళవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్(70 నాటౌట్;41బంతుల్లో11 ఫోర్లు, 1 సిక్స్) ఓ సొగసైన ఇన్నింగ్స్ తో ఆడి అదుర్స్ అనిపించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువరాజ్.. చివరి ఓవర్లలో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. ఒక లైఫ్ తో బతికిపోయిన యువరాజ్ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్ లో యువీ ఇచ్చిన క్యాచ్ ను సంజూ శాంసన్ వదిలేయడంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోంది. ప్రధానంగా ఆ క్యాచ్ వదిలేసిన తరువాత యువరాజ్ తనదైన షాట్లతో అలరించాడు.

టాస్ ఓడి తొలుతబ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్(30; 21 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్),శిఖర్ ధావన్(28;17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ జోడి 53 పరుగుల్నిజత చేసిన తరువాత వార్నర్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో శిఖర్ తో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే జట్టు స్కోరు 75 పరుగుల వద్ద ఉండగా శిఖర్ అవుటయ్యాడు .ఆపై స్వల్ప వ్యవధిలో విలియమ్సన్(24) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ వేగం తగ్గింది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసిన సన్ రైజర్స్.. 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో యువరాజ్ సింగ్-హెన్రిక్స్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. ముందు ఎటువంటి భారీ షాట్లకు పోకుండా క్రీజ్ లో కుదురుకునే యత్నం చేశారు. ఆ క్రమంలోనే యువరాజ్ ఇచ్చిన క్యాచ్ ను ఢిల్లీ ఫీల్డర్లు జారవిడిచారు. అప్పటికి యువరాజ్ స్కోరు 30 పరుగులు లోపే. ఆ తరువాత యువీ  మరింత వేగంగా ఆడి సన్ రైజర్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిక్స్(25 నాటౌట్;18 బంతుల్లో 2 ఫోర్లు) చక్కటి సహకారం అందివ్వడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement