వర్షం అనంతరం జింబాబ్వే ఇన్నింగ్స్ తిరిగి ప్రారంభమైంది. అయితే డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే విజయలక్ష్యాన్ని 363 పరుగులకు కుదించి, రెండు ఓవర్ల కోతను విధించారు. దీంతో జింబాబ్వే 48 ఓవర్లలోనే 363 పరుగుల లక్ష్యన్నిఛేదించాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆరో ఓవర్లో జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది.
మసకద్జాను విండీస్ బౌలర్ టెయిలర్ ఎల్ బీ డబ్ల్యూగా పవిలియన్ కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 34 పరుగులు చేసింది.