
గేల్ విజృంభించేనా?
కాన్‌బెర్రా (మనుకా ఓవల్): ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బిలో మంగళవారం జరగబోయే మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు, జింబాంబ్వేతో తల పడనుంది. మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఓడి, రెండో మ్యాచ్ లో పాక్ పై భారీ ఆధిక్యంతో విజయాన్ని వెస్టిండిస్ తమ ఖాతాలో వేసుకుంది. అదే జోరును జింబాంబ్వేతో జరిగే మ్యాచ్ లో కొనసాగించాలని కరేబియన్లు కసిగా ఉన్నారు. జింబాంబ్వే జట్టు కూడా యూఏఈతో జరిగిన మ్యాచ్లో గెలిచి, వెస్టిండిస్ పై కూడా గెలవాలని ఉవ్విల్లూరుతోంది.
విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఫామ్ లో లేక పోవడం వెస్టిండిస్ ని కలవర పరుస్తోంది. గత 20 నెలల్లో తన చివరి సెంచరీ చేసిన తర్వాత ఆడిన 19 ఇన్నింగ్స్ల్లో 14.42 సగటు స్కోరు మాత్రమే గేల్ నమోదు చేశాడు. పాక్తో ఆడిన కీలక మ్యాచ్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లోనైనా గేల్ విజృంభించి ఫాంలోకి రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.