విధానసభ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించిన వివిధ పార్టీలపై మొత్తం 106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించిన వివిధ పార్టీలపై మొత్తం 106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఆప్‌పై అత్యధికంగా 45, బీజేపీ, కాంగ్రెస్‌పై చెరో 25 నమోదయ్యాయన్నారు. ఇంకా బీఎస్‌పీపై ఎనిమిది నమోదయ్యాయన్నారు. మిగతా మూడు మిగిలిన పార్టీలపైనా నమోదయ్యాయని ఆయన వివరించారు. నిబంధలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.