కేవీబీపాళెం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా కేవీబీపాళెం మండలం బంగారు కండ్రిగ గ్రామంలో శనివారం వేకువజామున ఒక ఇంటి పైకప్పు కూలి 13 మంది కుటుంబసభ్యులు గాయపడ్డారు. వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.