ఉపాధి కోసం వెళ్లింది.. ఎక్కువగా బుడగ జంగాల వారే
కరీంనగర్: నేపాల్ భూకంపంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రెండువేల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వేములవాడ మండలం అనుపురం, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణరావుపల్లి, గొల్లపల్లి, కరీంనగర్ మండలం చేగుర్తి, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీ, మానకొండూర్‌లోని లింగాపూర్, చల్లూరు, రామడుగు మండలం గోపాల్‌రావుపేటతోపాటు మారేడుపల్లి, ఎరడపల్లి, గంగాధర తదితర గ్రామాల నుంచి రెండు వేల మంది బుడిగజంగాల వారు ఉపాధికోసం నేపాల్ వెళ్లారు. అక్కడ రంగురాళ్లు విక్రయించడం, జాతకాలు చెప్పడంతోపాటు కఠ్మాండు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఒక్క రామకృష్ణకాలనీవారే పైగా అక్కడ ఉంటారని తెలిసింది. ఈ కాలనీకి చెందినవారు సుమారు 50 మంది గాయూలపాలైనట్లు సమచారం.
అయితే, తమ వారు విపత్తులో చిక్కుకున్నారని తెలిసి ఇక్కడున్న కుటుంబసభ్యులు, బంధువులు క్షేమసమాచారాల కోసం టీవీలకు అతుక్కుపోయూరు. ఫోన్ల ద్వారా ఆరా తీస్తున్నారు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రైళ్లు, హెలికాప్టర్ ద్వారా నేపాల్ నుంచి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు అక్కడివారు తమ క్షేమ, సమాచారాలు అందించారు. బాధితుల్లో చాలా మందికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఫోన్‌లోనే విలపించారు. కాగా, బాధిత కుటుంబాల సమాచారం సేకరించి పంపాలని ఆయూ మండలాల రెవెన్యూ అధికారులను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు.
నేపాల్‌లో చిక్కుకున్న 2 వేల మంది?
Published Mon, Apr 27 2015 12:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM
Advertisement
Advertisement