ఆ లోగా 1984 అల్లర్లకు పాల్పడిన కాంగ్రెస్ నేతల పేర్లు బయటపెట్టాలి లేదంటే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా
మరిన్ని ఆందోళనలు చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సిక్కులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం అకాలీదళ్ నేతృత్వంలో సిక్కులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగగా శుక్రవారం ఢిల్లీ గురుద్వార్ మేనే జ్‌మెంట్ కమిటీ.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇం టర్వ్యూలో... 1984లో సిక్కులకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొని ఉండవచ్చని చెప్పారు. దీంతో ఆనాటి అల్లర్లలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల పేర్లను బయటపెట్టాలని సిక్కులు గత రెండుమూడు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. వీరికి అకాలీదళ్ కూడా మద్దతు పలకడం, స్వయంగా ఆందోళనకు దిగడంతో వివాదం మరింత ముదిరింది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో ఢిల్లీ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ రంగంలోకి దిగింది. 72 గంటల్లోగా దాడిలో పాల్గొన్న నేతల పేర్లను రాహుల్ గాంధీ బయటపెట్టాలని, లేదంటే తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది.
కేజ్రీవాల్ ప్రతిపాదనను ఆహ్వానించిన సిక్కులు..
1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు అకాలీదళ్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సిక్కుల నుంచి మద్దతు లభిస్తోంది. కేజ్రీవాల్ ప్రతిపాదనను తాము ఆహ్వానిస్తున్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకటించింది.
72 గంటల గడువిస్తున్నాం..!
Published Sat, Feb 1 2014 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement