చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి
Published Mon, May 8 2017 2:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎండవేడిమికి తట్టుకోలేక చెరువులో ఈతకెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం జంగారెడ్డిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మృతులను సాయివినాస్(16), గణేష్(18), శ్రీకాంత్(19)లుగా గుర్తించారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత‍్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్తులు చెరువు వద‍్దకు చేరి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement