వినాయక చవితికి 60 ప్రత్యేక రైళ్లు
♦ {పయాణికుల రద్దీని ద ృష్టిలో ఉంచుకునే: సెంట్రల్ రైల్వే
♦ నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం
ముంబై : గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు 01001 నంబర్ రైలు ముంబై సీఎస్‌టీ నుంచి అర్ధరాత్రి 12.20 బయలు దేరి మడ్గావ్‌కు మధ్యాహ్నం 2.30కు చేరుకుంటుంది. గురువారం మినహా ప్రతిరోజు ఈ సర్వీసు నడుస్తుంది. అలాగే రైలు నం 01002 మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి ఉదయం 4.25కు ముంబై సీఎస్‌టీ చేరుకుంటుంది. 01033 నంబరు రైలు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రతి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 కు మడ్గావ్ చేరుకుంటుంది.
అలాగే 01034 నంబర్ రైలు మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 3.25కి బయలుదేరి ముంబై సీఎస్‌టీకి ఉదయం 4.25కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు దాదర్ నుంచి సావంత్‌వాడీకి, సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ వరకు సావంత్‌వాడీ నుంచి దాదర్‌కు వారానికి మూడు రోజులపాటు ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం 01095 నంబరు రైలు దాదర్ నుంచి సావంత్‌వాడీ బయలుదేరుతుంది. ఉదయం 7.50కి దాదర్ నుంచి బయలుదేరి సాయంత్రం 8.30కు సావంత్‌వాడీకి చేరుకుంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం 01096 నంబరు రైలు సావంత్‌వాడీ నుంచి ముంబై బయలుదేరుతుంది. ఈ సేవలు నడుస్తాయి. సావంత్‌వాడీలో ఉదయం 4.50కి బయలుదేరి సాయంత్రం 3.50కి దాదర్ చేరుకుంటుంది. ఈ సేవలన్నీ స్పెషల్ చార్జీలతోటే నడుస్తాయని, బుకింగ్స్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.