నిరాహార దీక్షలో ఆప్ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్ | Aam Aadmi Party MLA RAJESH GARG Hunger strike | Sakshi
Sakshi News home page

నిరాహార దీక్షలో ఆప్ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్

Published Sun, Jan 5 2014 10:38 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

Aam Aadmi Party  MLA RAJESH GARG Hunger strike

 సాక్షి, న్యూఢిల్లీ:తరచూ బ్యాటరీ రిక్షాలో వెళుతూ అందరి దృష్టిని ఆకర్షించే రోహిణీ నియోజవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌గార్గ్ మరోమారు వార్తల్లో నిలిచారు. బీజేపీ కార్పొరేటర్‌కి చెందిన ఓ ఎన్‌జీవో కబ్జా నుంచి కమ్యూనిటీ సెంటర్‌ను విడిపించేం దుకు ఆయన రెండు రోజులుగా దీక్ష చేస్తున్నారు.ఆదివారంనాటి ధర్నాకు స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సైతం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్‌గార్గ్‌మాట్లాడుతూ.. సోమవారం వరకు ఎంసీడీ నిర్ణయం తీసుకోక పోతే స్థానికులు సైతం ఈ దీక్షలో కూర్చుంటారని స్పష్టం చేశారు. స్థానికులకు ఇవ్వకుండా కమ్యూనిటీ హాల్‌ను తమ సొంత ప్రయోజనాలకు సదరుఎన్‌జీవో వాడుకుంటోందని ఆరోపించారు. స్థానిక బాక్ల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుల్లా మాట్లాడుతూ.. 2010 నుంచి కాంగ్రెస్ సైతం ఈ విషయాన్ని పలుమార్లు లేవనెత్తిందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement