న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామర్థ్యానికి సవాలువిసురుతూ శాంతిభూషణ్ చేసిన వ్యాఖ్యలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి హితవు పలికారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆప్‌కు ఆయన భీష్మ పితామహుడి వంటి వ్యక్తి అని, అందువల్ల ఆయన మాట ల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశీలించాలన్నారు. పార్టీలో కచ్చితంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉం డాలన్నారు. తాను కూడా అంతర్గత ప్రజాస్వామ్యం గురించే మాట్లాడతానన్నారు. అందరూ గౌరవించే వ్యక్తి అయిన శాంతిభూషణ్ ఈ వ్యాఖ్యల్ని పార్టీలోనూ లేవనెత్తాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ప్రశ్నించకూడదు: అశుతోశ్
శాంతిభూషణ్ వ్యాఖ్యలపై వివాదం రేకెత్తిన నేపథ్యంలో ఈ విషయమై ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు అశుతోశ్ మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందా లేదా అనే అంశాన్ని లేవనెత్తకూడద న్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందన్నారు. అవినీతి వ్యతిరేకోద్యమం అరవింద్ మానసిక పుత్రికగా ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత ఏడాదిన్నర లోపే పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ 28 నియోజకవర్గాలను గెలుచుకుందన్నారు. అటువంటప్పుడు ఇటువంటి అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారని అశుతోశ్ ప్రశ్ని ంచారు.
ఈసీని కలవనున్న ఆప్
ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రంజిత్ సింగ్ నకిలీ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారనే ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చేవారం ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోలక్‌పూర్ (రిజర్వ్‌డ్) స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన రంజిత్ సింగ్ నకిలీ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడంద్వారా అటు నియోజవర్గ ప్రజలతోపాటు ఇటు ఎన్నికల కమిషన్‌ను వంచించారని ఆప్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొ ంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది.
భూషణ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలి
Published Thu, Aug 14 2014 10:41 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement