మళ్లీ పొరుగు గూటికే
నటి అంజలి అచ్చతెలుగమ్మాయి అన్న విషయం తెలిసిందే. నటిగా తొలి అడుగులు అక్కడే వేశారు. ఆ తరువాత కోలీవుడ్ రంగ ప్రవేశం, అంగాడితెరుతో గుర్తింపు వచ్చింది. అలా నటగా నిలదొక్కుకుంటున్న తరుణంలో పిన్ని భారతీదేవితో మనస్పర్దలు, దర్శకుడు కలైంజయంతో విబేధాలు అంటూ కలకలాని తెరలేపి హైదరాబాద్‌కు జంపయ్యారు. అక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తదితర చిత్రాల్లో నటించారు. దీంతో అంజలి ఇక కోలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసినట్లేనన్న ప్రచారం జోరుగా సాగింది.
అలాంటి వారు ఆశ్చర్య పడేలా మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమలో పునర్‌ప్రవేశం చేశారు. ప్రస్తుతం ఈ భామ జయంరవి సరసన అప్పాటక్కర్, విమల్‌కు జంటగా రజినీ మురుగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ బ్యూటీకిప్పుడు మరో లక్కీ ఛాన్స్ తలుపు తట్టింది. పిజ్జా, జిగర్‌తండా వంటి సక్సెస్‌పుల్ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తాజా చిత్రం ఇరవిలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, ఎస్‌జె సూర్య హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొదట విశ్వరూపం చిత్రం ఫేమ్ పూజాకుమార్ ఎంపిక చేసుకున్నారు. ఇలా వరుసగా అవకాశాలు వస్తుండటంతో అంజలి మళ్లీ తన మకాంను చెన్నైకి మార్చనున్నారని కోలీవుడ్ టాక్.