విజయ్‌ భాస్కర్‌ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు | again IT raid in tamilnadu health minister Vijaya Bhaskar residence | Sakshi
Sakshi News home page

విజయ్‌ భాస్కర్‌ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు

Published Wed, May 17 2017 11:06 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM

విజయ్‌ భాస్కర్‌ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు - Sakshi

విజయ్‌ భాస్కర్‌ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు

చెన్నై:  ఆర్కే నగర్‌ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై నివాసంపై ఐటీశాఖ మరోసారి పంజా విసిరింది. ఇలుప్పుర, పుదుకొట్టైలోని ఆయన నివాసాలతో పాటు పలుచోట్ల ఐటీ శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు.  

కాగా ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్‌ విజయం కోసం మంత్రి విజయభాస్కర్‌ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్‌ చాన్స్‌లర్‌ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మళ్లీ విజయ్‌ భాస్కర్‌ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement