ఆగం గీతం అబ్దుల్ కలాంకు అంకితం | Agam song dedicated Abdul Kalam | Sakshi
Sakshi News home page

ఆగం గీతం అబ్దుల్ కలాంకు అంకితం

Published Wed, Jul 29 2015 3:19 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

ఆగం గీతం అబ్దుల్ కలాంకు అంకితం - Sakshi

ఆగం గీతం అబ్దుల్ కలాంకు అంకితం

ఆగం చిత్రంలో అబ్దుల్ కలాంకు అంకితం ఇచ్చేలా ఒక గీతాన్ని రూపొందిస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు డాక్టర్ ఏ విజయ్ ఆనంద్ తెలిపారు. జోస్టర్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై లండన్‌కు చెందిన కోటేశ్వరరాజు నిర్మిస్తున్న చిత్రం ఆగం. కొత్త, పాత తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ప్రస్తుత విద్యా విధానాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నేటి విద్యా విధానం ఎలా ఉంది, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం పడుతున్న పాట్లు,  విదేశీ ఉద్యోగాల మోహంలోపడి ఎలా అవినీతికి పాల్పడుతున్నారు తదితర అంశాలను ఆవిష్కరించే చిత్రంగా ఆగం ఉంటుందన్నారు. అదే విధంగా దేశ ప్రజల ప్రగతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన అబ్దుల్ కలాంను గౌరవించే విధంగా ఒక గీతాన్ని ఈ చిత్రంలో పొందు పరచి, ఆయనకు అంకితం ఇవ్వనున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement