టీడీపీ, బీజేపీ నేతలకు ముందే తెలుసు: రఘువీరా
అనంతపురం: పెద్ద నోట్ల రద్దు అంశం టీడీపీ, బీజేపీ నేతలకు ముందే తెలుసు అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలోని సాయినగర్ ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద బైఠాయించిన ఆయన.. బ్లాక్ మనీని సురక్షితం చేసుకున్న తరువాతే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దు వల్ల చంద్రబాబు, లోకేష్‌లకు భారీగా ప్రయోజనం కలిగిందని అన్నారు. ప్రధాని ప్రకటనకు గంట ముందుగా ఓ బీజేపీ నేత కోటి రూపాయలు డిపాజిట్ చేశారని రఘువీరారెడ్డి తెలిపారు.
చంద్రబాబు లేఖ రాస్తే రూ.. 500, 1000 నోట్లు రద్దయ్యాయని అంటున్నారని.. ధైర్యం ఉంటే రూ. 2 వేల నోటు రద్దుపై లేఖ రాయాలని అన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కూడా బాబు లేఖ రాయొచ్చు కదా అని రఘువీరా రెడ్డి సూచించారు.