ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఎన్నికల్లో ఓటమిపాలు చేస్తానంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నుపుర్‌శర్మ ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఎన్నికల్లో ఓటమిపాలు చేస్తానంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నుపుర్‌శర్మ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. కేజ్రీవాల్‌తో ైసైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో నగరవాసులు కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వబోవడం లేదన్నారు. ఇందుకు కారణం ఆయనకు స్థిరత్వం లేకపోవడమేనన్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ‘తొలుత ఆయనకు స్థిరత్వం అవసరం. అది వచ్చాకే ఓటర్ల వద్దకు వెళ్లాలి. ఒకసారి ఇక్కడ... ఒకసారి అక్కడ మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కేజ్రీవాల్ అబద్ధాలను అర్థం చేసుకున్నారు. ఈసారి ఆయన...సీఎం కావడమనేది కలే’ అని అన్నారు.
ఈ నియోజకవర్గంలో సునాయాస విజయం కోసమే మిమ్మల్ని బీజేపీ బరిలోకి దించిందా అని అడగ్గా... దిగ ్గజాలను పరాజయం పాలుచేసిన నియోజకవర్గమిదని జవాబిచ్చారు. ‘అసలు కేజ్రీవాల్ ఎవరు. ఆయన ఓ మీడియా సృష్టి. ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చే నిధులను సైతం ఆయన వినియోగించడం లేదు. నగరవాసులకోసం ఆయన ఏమిచేశారని నేనడుగుతున్నా. వారాణాసి ఎన్నికలు ముగిశాక ఐదు నెలలపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే కోటా కింద వచ్చే నిధులతో ఆయన ఏమి చేశారు.’ అని ఆరోపించారు. ఎన్‌డీఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఒక్క కౌన్సిలర్ కూడా లేరని, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో చేయాల్సి ఉంటుందని అన్నారు. కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీజీ చేసిన శర్మ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2008లో జరిగిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వర్తించారు.
పార్టీకోసమే ఉద్యోగం వదిలేశా
లోక్‌సభ ఎన్నికల సారధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అధిష్టానం బాధ్యతలను అప్పగించినపుడు పార్టీ కోసం ఏదైనా చేయాల్సిన తరుణమిదేనని భావించానని శర్మ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సహరాన్‌పూర్, అమృత్‌సర్, వారణాసి నియోజకవర్గాల్లో పర్యటించానని తెలిపారు. దీనిని గుర్తించిన అధిష్టానం ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందని అన్నారు.