'సీఎంతో మాట్లాడాలనుకుంటే.. కాల్ చేయండి' | Arvind Kejriwal Will Wait For A Call From Delhi | Sakshi

'సీఎంతో మాట్లాడాలనుకుంటే.. కాల్ చేయండి'

Published Sun, Feb 14 2016 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

'సీఎంతో మాట్లాడాలనుకుంటే.. కాల్ చేయండి'

'సీఎంతో మాట్లాడాలనుకుంటే.. కాల్ చేయండి'

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గ సహచరులు ప్రజలతో మాట్లాడనున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గ సహచరులు ప్రజలతో మాట్లాడనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే రెండు గంటల పాటు అందుబాటులో ఉంటారు. ఫోన్ ద్వారా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు.

'ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? మీరడిగే ప్రశ్నలకు నాతో పాటు మంత్రులు సమాధాలిస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు 011-41501367, 41501383, 23346658 నెంబర్లకు ఫోన్ చేయండి' అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఏడాది పాలనలో చేపట్టిన పనుల గురించి కేజ్రీవాల్ సర్కార్ ప్రజలకు వివరించనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ రోజు పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించనున్నారు. గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement