చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా అత్యంత కీలమైన మేనిఫెస్టోను విడుదల చేసేందుకు డీఎంకే సిద్ధమైంది. 13వ తేదీన ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షులు కరుణానిధి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
తమిళనాడు చట్టసభకు 2016 ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. రా ష్ట్రంలోని ఏ ఒక్క పార్టీలో కూడా కూటమి ఖరారు కాలేదు. కూటమిపై కసరత్తులు చేస్తూనే ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా మేనిఫెస్టోను రూపొందించాలని అన్ని పార్టీలతోపాటు ప్రజలు సైతం ఆశిస్తున్నా రు. మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీల కంటే ముందున్న డీఎంకే ఈనెల 13 వ తేదీన మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం పెట్టుకుంది.
మాజీ కేంద్రమంత్రి టీఆర్ బాలు నేతృత్వంలోని బృందం మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది. ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీ నేతలను కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించింది. అలాగే ప్రజలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక, కర్షక వర్గాలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుంది. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి తయారుచేసిన మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షులు కరుణానిధి ఈనెల 13వ తేదీ విడుదల చేస్తారని బుధవారం అధికారికంగా ప్రకటించారు.
స్వతంత్య్ర ప్రభుత్వం:
ఇదిలా ఉండగా, ఎన్నికల పొత్తులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చే స్తామని డీఎంకే పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో డీఎండీకే, కాంగ్రెస్ పార్టీలు చేరవచ్చని సమాచారం. డీఎంకేతో పొత్తుకు బీజేపీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. డీఎంకే, బీజేపీల మధ్య పొత్తుకుదిరితే అది ఎన్‌డీఏ కూటమి కాగలదు. డీఎండీకేను ఎలాగైనా తమ కూటమిలో చేర్చుకోవాలని కరుణానిధి ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంలో వాటా ఇస్తేనే పొత్తు అని విజయకాంత్ బేరం పెడుతున్నారు.
డీఎంకే కూటమిలో చేరితే ఎలాగూ ముఖ్యమంత్రి పదవి దక్కదు కాబట్టి కనీసం ఉప ముఖ్యమంత్రి కుర్చీనైనా దక్కించుకోవాలని కెప్టెన్ ఆశపడుతున్నారు. డీఎంకేలేని బీజేపీ కూటమితో జతకట్టిన పక్షంలో ముఖ్యమంత్రి పీఠమే అప్పగించాలని డీఎండీకే అధినేత విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. డీఎండీకేను మచ్చికచేసుకునే బాధ్యతను కాంగ్రెస్‌కు అప్పగించింది డీఎంకే నాయకత్వం. కాంగ్రెస్, డీఎండీకే పార్టీలతో కలిసి పోటీకి దిగితే అధికారం ఖాయమని డీఎంకే ధీమాతో ఉంది. కూటమి గెలుపులో ఎవరి వాటా ఎంత ఉన్నా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం వారి ప్రమేయం ఉండదని డీఎంకేలో ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం మాదే!
Published Thu, Feb 11 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement