ఒక్క రూపాయి ఇవ్వండి... ప్లీజ్ | B Saroja devi 5 lakhs donates to Chief Minister Relief fund due to chennai floods | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి ఇవ్వండి... ప్లీజ్

Published Fri, Jan 1 2016 9:46 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఒక్క రూపాయి ఇవ్వండి... ప్లీజ్ - Sakshi

ఒక్క రూపాయి ఇవ్వండి... ప్లీజ్

చెన్నై : ఎంజీఆర్ ఇంటి కోసం ఒక్కో అభిమాని ఒక్క రూపాయి ఇవ్వండి అంటున్నారు ప్రఖ్యాత నటి సరోజదేవి. దివంగత మహానటులు ఎంజీయార్, శివాజీ గణేశన్‌ల సహకాల నటి ఈమె అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు బహుభాషా అభినయ విశారద సరోజాదేవి. అలాంటి నటి ఎంజీయార్ ఇంటి కోసం ఒక్క రూపాయి ఇమ్మంటున్నారేమిటి అనేగా మీ సందేహం.

ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న సరోజదేవి ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటి చూద్దాం. ఇటీవల తుపాన్ కారణంగా చెన్నై, పాండిచ్చేరి చాలా బాధింపులకు గురైన విషయం తెలిసి మనసు వేదనకు గురైంది. తమిళనాడు నాకు మెట్టినిల్లు లాంటిది. అందువలన తుపాన్ నివారణకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించాను.


ఐదు లక్షల విరాళం: జనవరి ఆరవ తేదీన చెన్నై రానున్నాను. తుపాన్ నివారణ కోసం ఐదు లక్షలు విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను.

ఎంజీయార్ ఇల్లు: తుపాన్ కారణంగా చెన్నైలోని ఎంజీయార్ నివసించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని ఆయన జ్ఞాపకాలుగా వున్న వస్తువులు చాలా వరకు కొట్టుకుపోయాయని, మరికొన్ని పాడైపోయాయని తెలిసి చాలా బాధ అనిపించింది. మనిషిగా వచ్చి దైవంగా పోయిన వ్యక్తి ఎంజీయార్. ఆయన ఇంటిలో కూర్చొని భోజనం చేశాను. ఎంజీయార్ ఇంటిని ఆయన అభిమానులు పరిరక్షించుకోవాలి. ఒక్కో అభిమాని ఒక్క రూపాయి చొప్పు ఇచ్చినా ఎంజీయార్ ఇల్లును సుందరంగా మార్చుకోవచ్చు.


శింబు క్షమాపణ చెప్పాల్సింది: ఆ కాలంలో ప్రముఖ కథానాయికలుగా వెలుగొందిన మేము వేలలోనే పారితోషికం తీసుకున్నాం. ఇప్పటి హీరోయిన్లు కోట్లు తీసుకుంటున్నారు. త్వరగా సంపాదించి సొంత ఊళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఇక నటుడు శింబు వివాదం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చూశాను. ఆయన తన తప్పు క్షమాపణ చెప్పి వుండవచ్చు. మనమైనా ఆయన్ను క్షమించి ఉండాల్సింది. శింబు తల్లిదండ్రులు ఆవేదన చూస్తే పాపం అనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement