‘అగ్రి’కి షాక్ బెయిల్ నిరాకరణ | Bail pleas of ex-minister, official dismissed in suicide case | Sakshi
Sakshi News home page

‘అగ్రి’కి షాక్ బెయిల్ నిరాకరణ

Published Fri, May 1 2015 2:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Bail pleas of ex-minister, official dismissed in suicide case

సాక్షి, చెన్నై : మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం షాక్  ఇచ్చింది. ఆయనకు , వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌కు బెయిల్ నిరాకరించింది. తిరునల్వేలి వ్యవసాయ శాఖ అధికారి ముత్తుకుమార స్వామి అనుమానాస్పద మృతి కేసును సీబీసీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుతో మంత్రి పదవిని కోల్పోయిన అగ్రి కృష్ణమూర్తి చివరకు కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముత్తుకుమార స్వామిని బెదిరించినందుకుగాను అగ్రి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ప్రధాన ఇంజనీరు సెంథిల్‌కుమార్‌లను పాళయం కోట్టై జైళ్లో ఉంచారు.
 
  తమకు బెయిల్ ఇవ్వాలంటూ కింది కోర్టులను ఆశ్రయించినా పలితం శూన్యం. దీంతో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. వీరి పిటిషన్ విచారణ గురువారం జరగ్గా, ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రామచంద్రన్ బెయిల్ ఇవ్వకూడదని ఆక్షేపన వ్యక్తం చేశారు. కేసు విచారణ సాగుతున్నదని, వీరిని బయటకు పంపిన  పక్షంలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఆ ఇద్దరికి షాక్ ఇస్తూ, బెయిల్ నిరాకరిస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక, ఈ కేసులో విచారణలో భాగంగా తిరునల్వేలి కోర్టులో అగ్రి కృష్ణమూర్తి , సెంథిల్‌కుమార్‌లను హాజరు పరిచారు. వారి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement