అవినీతి అధికారులతో సిగ్గు సిగ్గు | bjp mla vishnu kumar raju comments on Corruption officers | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారులతో సిగ్గు సిగ్గు

Published Sun, Nov 27 2016 5:46 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

అవినీతి అధికారులతో సిగ్గు సిగ్గు - Sakshi

అవినీతి అధికారులతో సిగ్గు సిగ్గు

ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటుకు చర్యలు
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

సీతమ్మధార: 
‘ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని వస్తే నా నియోజకవర్గంలో అవినీతి అధికారులతో సిగ్గేస్తోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అవినీతి పెరిగిపోయిందని, రాజకీయాలకు ఎందుకు వచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నానని అన్నారు. నీతి నిజాయితీ, మంచితనంతో నియోజకవర్గంలో పనిచేస్తున్నానని, అలాంటిది తన నియోజకవర్గంలో నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కాడం చూస్తే ఎంతగా అవినీతి పెరిగిపోయిందో చూస్తున్నామని పేర్కొన్నారు.

ఉత్తర నియోజకవర్గంలో ఉత్తమ అధికారులను నియమించాలని సీఎం, హోం శాఖ మంత్రి, సీపీలను కోరారు. తాను ఇంత వరకు ఏ ఒక్క అధికారిని బదిలీ చేయాలని ఎవరినీ కోరలేదన్నారు. భీమిలి, పరవాడ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ కార్యాలయంలో త్వరలో ఫిర్యాదులు బాక్స్‌ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. లంచగోండి అధికారులపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement