ఆరుషి తల్వార్ హత్య నేపథ్యంలో వచ్చిన సినిమా ‘రహస్య’ విడుదలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. జూన్ 13 వరకు విడుదల చేయకూడదని నిర్మాతలను ఆదేశించిన హైకోర్టు
ముంబై: ఆరుషి తల్వార్ హత్య నేపథ్యంలో వచ్చిన సినిమా ‘రహస్య’ విడుదలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. జూన్ 13 వరకు విడుదల చేయకూడదని నిర్మాతలను ఆదేశించిన హైకోర్టు...ప్రోమోల నిలిపివేతకు నిరాకరించింది. సెలవుల తరువాత జూన్ 13న విచారించిన అనంతరం సినిమా విడుదలను నిర్ణయిస్తామని జస్టిస్ వీఎం కనడే, అనిల్ మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ కూతురు హత్య కేసులోని నిజానిజాలను వక్రీకరించేలా ఈ సినిమా ఉందంటూ ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న తల్వార్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది.