అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి? | botsa satyanarayana criticise govt decision on demonetisation | Sakshi
Sakshi News home page

అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?

Published Mon, Nov 28 2016 3:28 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి? - Sakshi

అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుపై జరిగిన హర్తాళ్ కు ప్రజలు మద్దతు ప్రకటించారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ...  చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేయిందని విమర్శించారు.

ప్రజల ఇబ్బందులు పట్టవా, నోట్ల కష్టాలపై మీ వైఖరేంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేదా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడితే గృహనిర్బంధాలా అని వాపోయారు. చంద్రబాబుతో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్‌ గ్రూపు ఔట్‌ లెట్లలో ప్రజలకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఏటీఎంలు ఉండగా... ఫ్యూచర్‌ గ్రూపుతో చేసుకున్న ఒప్పందం ఏంటని అడిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement